: హైదరాబాదులో ఫర్నిచర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు


హైదరాబాదు, ఆసిఫ్ నగర్, జిర్రా రోడ్ లోని ఓ ఫర్నిచర్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నేటి తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడ కలకలం రేగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతంలో అలముకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. దీంతో రంగప్రవేశం చేసిన సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ గోడౌన్ కావడంతో అగ్నికీలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News