: సొంత ఊర్లోనే ఇళ్లు కట్టించని వారు రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా కట్టిస్తారు?: రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిపరుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఊరిలోనే పేదలకు ఇళ్లు కట్టించలేని ఆయన రాష్ట్రమంతా డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా నిర్మిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టులో పేదల ఇళ్లను రద్దు చేసి, ఇంద్రకరణ్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.