: టీటీడీ జేఈవో వారించినా.. కొంచెం దూరం వెళ్లి నిబంధనలు ఉల్లంఘించిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏది మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా సంచలనమే. ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ఆమె మాట్లాడబోగా... పక్కనే ఉన్న టీటీడీ జేఈవో వారించారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడరాదంటూ సూచించారు. దీంతో, రోజా ఏమీ మాట్లాకుండా, ముందుకు వెళ్లారు. కొంచెం దూరం వెళ్లి జీఎన్సీ టోల్ గేట్ వద్ద ఆమె నిబంధనలను ఉల్లంఘించి, మీడియాతో రాజకీయాల గురించి మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంపై, ఏపీ పోలీసులపై ఆమె తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న జీఎన్సీ విజిలెన్స్ అధికారులు రోజా విషయాన్ని చూసీ చూడనట్టు వదిలేశారు.