: వారికి శిక్ష పడేవరకు నేను నటించను!: స్పష్టం చేసిన సినీ నటి భావన


తనపై దాడిచేసిన నేరస్తులకు శిక్ష పడేవరకు తాను సినిమాల్లో నటించేది లేదని మలయాళ నటి భావన స్పష్టం చేశారు. ఆమెపై దాడి చేసిన వారిలో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ ద్వారా పలు విషయాలు వెలుగుచూశాయి. ప్రముఖ నటుడు, ఓ రాజకీయ నాయకుడి ఇద్దరు కుమారులు కిడ్నాపర్లతో పలుమార్లు మాట్లాడినట్టు తేలింది. వారితో రూ.50 లక్షలకు బేరం కుదిరినట్టు నేరస్థులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.  కాగా తనను కిడ్నాప్ చేసి హింసించిన వారికి శిక్ష పడే వరకు తాను సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని భావన శపథం చేశారు. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడుతుందని భావిస్తున్నానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News