: ఆదివారం నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: ఏపీపీఎస్సీ ఛైర్మన్
ఏపీ పీఎస్సీ ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ పీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. పరీక్షకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సెంటర్లతో పాటు, హైదరాబాదులోని 86 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ పరీక్షకు ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ఆయన తెలిపారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలు ఈ నెలాఖరులోగా తెలపాలని అన్ని శాఖలకు లేఖలు రాశామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అందగానే ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.