: హీరోయిన్ ఏజెంట్‌నని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాడట!
సాలిట్యూడ్ లైఫ్‌స్టైల్ ఐఎన్‌సీకి చెందిన ప్రశాంత్ మాల్గేవార్ అనే వ్యక్తి తన ఏజెంట్‌నని చెప్పుకుంటూ పలు సంస్థల నుంచి డబ్బు తీసుకుంటున్నాడని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేశ్‌భట్ కుమార్తె, నటి పూజా భట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చినప్పుడు ఎంతో కంగారు పడ్డానని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని, ఇలాంటి ఫ్రాడ్ చేసిన ప్రశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఓ ప్రముఖ ఈవెంట్ కంపెనీకి ఓ సాధారణ వ్యక్తి వచ్చి పూజా ఏజెంట్‌నని చెప్పి డబ్బు అడిగితే ఇచ్చేయడమేనా? అని ఆమె ప్రశ్నించారు. కనీసం అది నిజమో కాదో అని చెక్ చేసుకోవాల్సిన పనిలేదా? అని నిలదీశారు. ఈ విషయంపై తాను ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.