: తొలి సెషన్ ఆస్ట్రేలియాదే.. నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాట్స్ మెన్


పూణేలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలి సెషన్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని చాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్... నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి ఒక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. డేంజరస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 6 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ స్మిత్ క్రిజులోకి అడుగుపెట్టాడు. మరో ఓపెనర్ రెన్షా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. దీంతో షాన్ మార్స్ క్రీజులోకి వచ్చాడు. స్మిత్, మార్ష్ ఇద్దరూ చెరి ఒక పరుగు చేసి క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News