: రెండో ఓవర్ కే అశ్విన్ ను దింపిన కోహ్లీ.. మైండ్ గేమ్ స్టార్ట్ అయింది!
ఉపఖండపు పిచ్ లపై స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇతర దేశాల బ్యాట్స్ మెన్లకు అంత ఈజీ కాదు. అందుకే, ఆసీస్ టీమ్ ఇండియా సిరీస్ కు రాక ముందు నుంచే టీమిండియా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫుల్ గా ఫోకస్ చేసింది. స్పిన్ ను ఎదుర్కోలేక పోతే భారత్ పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు ఆస్ట్రేలియాకు సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను ఇషాంత్ శర్మతో వేయించిన కోహ్లీ... ఊహించని విధంగా రెండో ఓవర్ ను అశ్విన్ తో వేయించాడు. దీని ద్వారా, మ్యాచ్ ఆరంభం నుంచే ఆసీస్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి మూడు ఓవర్లు ముగిశాయి. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 2, రెన్షా 9 నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ స్కోరు 11 పరుగులు.