: జనాల సొమ్ముతో కాదు.. సొంత సొమ్ముతో మెక్కులు చెల్లించుకోవాలి: కేసీఆర్ పై సీపీఎం ఫైర్


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ మొక్కులు చెల్లించుకోవడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. సొంత సొమ్ముతోనే మొక్కులు చెల్లించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనకుండా జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News