: మొబైల్ షో రూం సిబ్బందితో ఫైటింగ్ చేసి.. వీరంగం సృష్టించిన తల్లీకూతుళ్లు!
ఢిల్లీలోని రాజోరీ గార్డెన్ ప్రాంతంలోని ఓ మొబైల్ షోరూంలో తల్లీకూతుళ్లు వీరంగం సృష్టించారు. సరిగా లేని మొబైల్ ఫోన్ తమకు ఇచ్చారంటూ షాపులోని సిబ్బందితో ఫైటింగ్ చేశారు. తాము తీసుకున్న మొబైల్ ఫోన్ సరిగా పనిచేయడం లేదని, అది తీసుకొని కొత్త మొబైల్ ఫోన్ ఇవ్వాలని గొడవకు దిగారు. తమకు అటువంటి ఫోను ఎందుకు ఇచ్చారని కూతురు అక్కడి సిబ్బందిలో ఒకరిని పిడిగుద్దులు గుద్దింది. షాపులోని వస్తువులను, పలు సెల్‌ఫోన్‌లను కిందపడేసింది. అడ్డుగా వచ్చిన షాపు యజమానిని కూడా కొట్టింది. కూతురితో పాటు ఆమె తల్లి కూడా షాపులోకి దూసుకొచ్చి నానా హంగామా చేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సదరు మహిళలపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.