: జవాన్ అవతారమెత్తిన సెహ్వాగ్!


‘జవాన్ హమారా భగవాన్’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా, జవాన్ డ్రెస్సులో తుపాకీ చేత బట్టి ఉన్న సెహ్వాగ్ తన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఎక్కడ దిగాననే విషయాన్ని సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2005-06లో టీమిండియాకు ఆడుతున్న సమయంలో తాను ఓ సారి బెంగళూరులోని ఆర్మీ క్యాంప్ ను సందర్శించానని, జవాన్లతో కలిసి రెండు రోజుల పాటు అక్కడ గడిపానని, ఆ సందర్భంలో ఈ ఫొటో దిగానని చెప్పాడు. ‘భారత్ ఆర్మీని చూసి గర్వపడుతున్నాను.. మీరు ఉంటేనే మేము ఉంటాము’ అని ఆ ట్వీట్ లో సెహ్వాగ్ తన దేశభక్తిని చాటుకున్నాడు.

  • Loading...

More Telugu News