: వరాహస్వామిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు
సీఎం కేసీఆర్ కుటుంబం వరాహస్వామిని దర్శించుకుంది. అనంతరం, వాహన మండపం నుంచి బ్యాటరీ వాహనంలో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. మహాద్వారం నుంచి కేసీఆర్ దంపతులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మంత్రులు శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. టీటీడీ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, అర్చకులు మహాద్వారం వద్ద కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఏపీ రాష్ట్ర ప్రతినిధిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నారు.