: ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జా అందిస్తున్న ‘పిజ్జా హట్’
ప్రపంచ దేశాలన్నింటినీ తమ వైపుకు తిప్పుకుంటున్న ఇస్రో విజయాలపట్ల పిజ్జా హట్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జా అందిస్తామని చెప్పింది. ఇటీవలే ఇస్రో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో ఉన్న పిజ్జా హట్‌లో ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జాలు ఇస్తున్నట్లు పేర్కొంది. సుమారు 2000 మంది ఇస్రో ఉద్యోగులకు ఆరు లక్షల విలువ చేసే పిజ్జాలను పంపిణీ చేసినట్లు తెలిపింది.