: విదేశాల్లో తలదాచుకుంటున్న జకీర్ నాయక్ స్కైప్‌లో మాట్లాడతాడట!
ఇస్లామిక్ వివాదాస్పద బోధకుడు, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ తనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనకు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు కూడా పంపింది. అయితే, ఈ విషయంపై ఆయన తరఫు న్యాయవాది మహేశ్ మూలే స్పందిస్తూ... జకీర్ నాయక్ మనీలాండరింగ్ కేసులో తన వాదనను స్కైప్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా తెలియజేస్తారని చెప్పినట్లు తెలిపారు.
జకీర్ నాయక్ నడుపుతున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై సర్కారు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పేర్కొన్న జకీర్ నాయక్ ఈ కేసులో తుది ఆదేశాలు వెలువడే వరకు వేచి చూడాలని ఈడీని కోరారు.