: ఓటర్ల లిస్టులో బాలీవుడ్ నటుడి పేరు గల్లంతు!


బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కు షాక్ తగిలింది. ఓటర్ల జాబితాలో అతని పేరు లేకపోవడంతో అక్కడి అధికారులు వరుణ్ ధావన్ ని అడ్డుకున్నారు. దీంతో, నిర్ఘాంతపోయిన వరుణ్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తాను ఓటు వేశానని, ఇప్పుడు మాత్రం తన ఓటు లేదంటున్నారని అన్నాడు. కాగా, బాలీవుడ్ నటీనటులు రేఖ, అనుష్క శర్మ, రణబీర్ కపూర్, ముంబై మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతా, హెచ్ డీఎఫ్ సీ చైర్మన్ దీపక్ పరేఖ్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News