: మాంసాహారం ఇష్టంగా లాగించేస్తున్నారా?... అయితే మీకు షుగర్ ముప్పు అధికం!
మాంసం లేనిదే మీకు ముద్ద దిగడం లేదా? అయితే మీకు మధుమేహం వచ్చే ముప్పు అధికమని స్పెయిన్ కు చెందిన రొవిరా-ఐ-విర్జిల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. చికెన్ మటన్, బీఫ్, పోర్క్ ఇలా జంతుమాసం ఏదైనా విరివిగా తింటూ ఉంటే కనుక మధుమేహానికి ఆహ్వానం పలుకుతున్నట్టేనని వారు స్పష్టం చేశారు. జంతు సంబంధ ఆహార పదార్థాలకు, మధుమేహానికి మధ్య సంబంధంపై కొంత మంది కార్యకర్తల ఆరోగ్య పరిస్థితులను నాలుగేళ్ల పాటు పరిశీలించి, విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు అధ్యయనం కొనసాగించారు.
వీరిని రెండు భాగాలుగా విభజించి కొందరికి మాంసాహారం, మరికొందరికి పూర్తి శాకాహారం అందజేశారు. శాకాహారం తీసుకున్న వారి కంటే మాంసాహారం తీసుకున్నవారు మధుమేహం బారినపడినట్టు గుర్తించామని తెలిపారు. దీంతో భోజనంలో మాంసాహారం కంటే శాకాహారం అధికంగా ఉండేలా చూసుకోవాలని, వంట నూనెగా ఆలివ్ ఆయిల్ ను వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు.