: చేనేత సత్యాగ్రహ సభకు చేరుకున్న పవన్ కల్యాణ్


ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న చేనేత సత్యాగ్రహ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షను పవన్ కల్యాణ్ విరమింపజేయనున్నారు. పవన్ కల్యాణ్ రావడంతో సభాప్రాంగణంలో అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువైంది. పవన్ కల్యాణ్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు, చేనేత కార్మికులు ఉత్సాహం చూపారు. దీంతో పలుమార్లు నిర్వాహకులు పవన్ కల్యాణ్ పై పడవద్దని, ఆయనకు కాస్త దూరం జరగాలని పిలుపునివ్వాల్సి వచ్చింది.  

  • Loading...

More Telugu News