: నెట్‌లో చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు.. పోలీసుల‌కు వ‌ర్ల రామ‌య్య ఫిర్యాదు


సోష‌ల్ మీడియాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అభ్యంత‌ర‌కర పోస్టులు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై ఏపీ హౌసింగ్‌బోర్డు ఛైర్మన్‌ వర్ల రామయ్య ఈ రోజు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫొటోలను మార్పింగ్‌ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న పోలీసుల‌కి తెలిపారు. ఇటీవ‌ల త‌న ఫేస్‌బుక్ ఖాతాలోకి చంద్ర‌బాబు ఫొటోను మార్పింగ్‌ చేసి ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగ్ వ‌చ్చింద‌ని ఆయ‌న మీడియాకు తెలిపారు. ఇలాంటి వాటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం కూడా ఉందని అన్నారు. ఇటువంటి పోస్టులు చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను పోలీసుల‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News