: మరొకరితో ప్రేమలో పడ్డ కరిష్మా కపూర్


ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ ప్రేమలో పడటం ఇదంతా బాలీవుడ్ లో చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలో కరిష్మా కపూర్ కూడా చేరిపోయింది. తన భర్త సంజయ్ కపూర్ తో గతేడాది విడాకులు తీసుకున్న కరిష్మా కపూర్  కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కొంత కాలం ఒంటరిగానే ఉన్న కరిష్మ... గత కొద్ది కాలంలా సందీప్ తోష్నివాల్ అనే వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉంటోందట. తన కుటుంబంలో జరిగే అన్ని వేడుకలకు అతన్ని ఆహ్వానిస్తోందట. ఇటీవలే కరిష్మ తండ్రి రణధీర్ కపూర్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కూడా అతడిని వెంటబెట్టుకొచ్చిందట. మరోసారి తన చిన్న తాత శశికపూర్ ఇంట్లో విందు కార్యక్రమం ఉంటే...అక్కడకు కూడా సందీప్ ను తీసుకెళ్లిందట. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని... వీరి ప్రేమకు కుటుంబసభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

  • Loading...

More Telugu News