: రైల్వే ప్లాట్ ఫామ్ పైకి కారుతో వెళ్లిన అండర్-19 క్రికెటర్ అరెస్టు!
ముంబయిలోని అంధేరి రైల్వేస్టేషన్ లోకి కారుతో పాటు వెళ్లిన అండర్ -19 క్రికెటర్ హర్మీత్ సింగ్ బదహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 7.10 గంటల ప్రాంతంలో హర్మీత్ తన హ్యుందాయ్ సెడాన్ కారుతో ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చాడు. దీంతో, అక్కడ వున్న ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ సీనియర్ పోలీసు అధికారి మనీశ్ రాథోడ్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించినందుకు హర్మీత్ ను అరెస్టు చేశామని, రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద అతనిపై కేసు నమోదు చేశామని, నేరం రుజువైతే హర్మీత్ కు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని అన్నారు. ప్లాట్ ఫామ్ పై రద్దీ లేకపోవడంతోఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.