: 500 మందిని హత్యచేశాడు... 200 మందిపై అత్యాచారాలు చేశాడు.. చివ‌రికి చిక్కాడు!


బాగ్దాద్‌లో కుర్దు దళాలు ఓ మాన‌వ మృగాన్ని బంధించాయి. ఎన్నో దురాగ‌తాల‌కు పాల్ప‌డుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న అత‌డి గురించి తెలిస్తే ఎవ‌రికైనా ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది. అత‌డి వ‌య‌సు కేవ‌లం 21 ఏళ్లు మాత్ర‌మే. ఇస్లామిక్‌ స్టేట్ లో చేరిన అమ‌ర్ హుస్సేన్ సుమారు 200 మంది మహిళలపై అత్యాచారాలు చేశాడు. దాదాపు 500 మంది ప్రాణాలు తీశాడు. ఇరాక్‌లోని సింజార్‌ ప్రాంతంలోని మైనార్టీ తెగకు చెందిన యాజీదీ లపై ఇస్లామిక్‌స్టేట్‌ ఉగ్రవాదులు దారుణాల‌కు పాల్ప‌డి, ఆ ప్రాంతాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకున్న‌ విష‌యం తెలిసిందే.
 
మహిళలను, యువతులను సెక్స్‌ బానిసలుగా మార్చారు. ఆ క్ర‌మంలోనే గాలింపుల పేరుతో ఇళ్ల‌లోకి ప్ర‌వేశించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు హుస్సేన్ విచార‌ణ‌లో పేర్కొన్నాడు. తాము స్వాధీనం చేసుకున్న‌ వారి తలలు నరికివేయడం, పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చివేయడం వంటి దారుణాలు చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు. ఓ రోజు ఒకేసారి సుమారు 40 మందిని చంపివేసినట్లు తెలిపాడు.

  • Loading...

More Telugu News