: భావన సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా: నటి రాయ్ లక్ష్మి


దక్షిణాది నటి భావనపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ పలువురు సినీ తారలు స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి రాయ్ లక్ష్మి సామాజిక మాధ్యమాల ద్వారా తన సందేశాలను పోస్ట్ చేసింది. ఈ సంఘటన నిజం కాకూడదని కోరుకుంటున్నానని, ఒకవేళ ఈ సంఘటన నిజమే అయితే, మనం గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఇకపై ఎవరినైనా ఎలా నమ్మగలం? అని ప్రశ్నించింది. భద్రత అనే పదానికి ఇప్పుడు అర్థమే లేదని, భావన సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో పేర్కొంది. కాగా, భావవ స్నేహితురాలు భామ కూడా స్పందించారు. ఇటువంటి విషయాలను ఏ హీరోయిన్ బయటకు చెప్పుకోలేదని, నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News