: 'జీఎస్ఎల్వీ ఎఫ్ 09' ప్రయోగాన్ని వాయిదా వేసుకున్న ఇస్రో


ఈ సంవత్సరం మార్చిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తలపెట్టిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగం వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో ఈ ప్రయోగాన్ని ప్రస్తుతానికి రద్దు చేసుకుంటున్నట్టు ఇస్రో వెల్లడించింది. కాగా, అధిక బరువైన ఉపగ్రహాలను నింగిలోకి పంపించే దిశగా ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో తలపెట్టిన సంగతి తెలిసిందే. రాకెట్ నిర్మాణంలో ఏర్పడిన ఇబ్బందుల కారణంగా మార్చిలో జరగాల్సిన జీఎస్ఎల్వీ ఎఫ్ 09 ప్రయోగాన్ని నెల పాటు వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్ లో ఈ ప్రయోగం ఉంటుందని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. కాగా, గత వారంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News