: పన్నీర్ కొత్త పార్టీ... పేరు 'అమ్మాడీఎంకే'!
తమిళనాడులో ప్రజా మద్దతు ఉన్నప్పటికీ, శశికళ ఎత్తులకు చిత్తు అయిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమ్మాడీఎంకే పేరిట కొత్త పార్టీని ఆయన ప్రారంభించనున్నట్టు సమాచారం. తనతో సహా, తనవెంట ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ, స్పీకర్ ప్రకటన చేసే అవకాశాలున్న నేపథ్యంలో, కొత్త పార్టీని సాధ్యమైనంత త్వరగా పెట్టాలన్న ఆలోచనలో ఉన్న ఆయన, తన వర్గం నేతలతో చర్చిస్తున్నారు. నేడో, రేపో 'అమ్మాడీఎంకే' పేరిట పొలిటికల్ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.