: టెలీకాలర్ సునీతది ఆత్మహత్యే... స్వయంగా పెట్రోల్ కొంటున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తం!


హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టెలీ కాలర్ సునీత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాదాపూర్ లోని ఓ పెట్రోలు బంకు నుంచి పెట్రోల్ కొనుగోలు చేసి ప్లాస్టిక్ డబ్బాను చేత్తో తీసుకువెళుతున్న దృశ్యాలు వెలుగులోకి రాగా, ఆమే స్వయంగా ఒంటికి నిప్పంటించుకుని ఉండవచ్చన్న అంచనాకు వస్తున్నారు.

కాగా, ఓ కాల్ సెంటరులో పనిచేస్తున్న యువకుడిని ప్రేమించిన సునీత, అతని కోసం భాగ్యనగర్ కాలనీకి వెళ్లిందని, 14వ తేదీన ప్రేమికుల రోజు కావడంతో, తన ప్రేమను తెలిపి, అంగీకరించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ యువకుడు, తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి, ఆపై సునీత నంబరును బ్లాక్ చేశాడని, ఆపై రెండు రోజుల పాటు సునీతను కలవలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సునీత ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. ఈ కేసులో సదరు యువకుడిని ప్రశ్నించి, అతని సెల్ ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ లను సేకరించామని, మరో రెండు రోజుల్లో హత్యా? ఆత్మహత్యా అన్న సందిగ్ధతను పూర్తిగా తొలగిస్తామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

  • Loading...

More Telugu News