: నేను దళితుడిని.. అందుకే అవమానించారు.. రహస్య ఓటింగ్ జరిగినా పళనిస్వామి విజయం సాధించేవారు!: తమిళనాడు స్పీకర్ ధనపాల్


తమిళనాడు శాసనసభలో శనివారం జరిగిన పరిణామాలపై స్పీకర్ పి.ధనపాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడం వల్లే డీఎంకే సభ్యులు తనను అవమానించారని ఆరోపించారు. అసెంబ్లీలో తీర్పులు చెప్పే తాను తనకు జరిగిన అవమానం గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. దళిత వర్గంలో అట్టడుగున్న ఉన్న అరుంధతీయ కుటుంబం నుంచి తాను వచ్చానని, జయలలిత తనను రెండుసార్లు అసెంబ్లీ స్పీకర్‌ను చేసి గౌరవించారని గుర్తు చేశారు. సభాసంప్రదాయాలను గౌరవించే తనపై డీఎంకే సభ్యులు దాడి చేసి అవమానించారని తెలిపారు. ఓటింగ్ జరగకూడదనే డీఎంకే రగడ చేసిందన్నారు. రహస్య ఓటింగ్ జరిగినా పళనిస్వామి వర్గమే విజయం సాధించి ఉండేదని స్పీకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News