: కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న పన్నీర్ మద్దతుదారు
తమ ప్రియతమ నేత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకున్న ఆయన మద్దతుదారుడు, తన కోరిక తీరకపోవడంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన తరువాత మనస్తాపంతో శరీరానికి నిప్పంటించుకుని తీవ్ర గాయాల పాలైన కాంచీపురం జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త మూసా (33), ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మూసాను చెన్నైలోని కీల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా, పన్నీర్ సెల్వం నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు కూడా. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ ఉదయం మూసా మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.