: పాకిస్థాన్‌లో హఫీజ్‌ సయీద్‌ చుట్టూ మరింత బిగిసిన ఉచ్చు


అమెరికాతో పాటు పలు దేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవ‌డంతో ఇటీవ‌లే ముంబయి దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా ఉగ్ర సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను అక్కడి ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ఉగ్ర‌వాది చుట్టూ ఉచ్చు మ‌రింత బిగిసింది. పాకిస్థాన్ చ‌ట్టం ప్రకారం ఈ రోజు త‌మ‌ ఉగ్రవాద నిరోధక చట్టంలోని నాలుగో షెడ్యూల్‌లో అతడి పేరును చేరూస్తూ పంజాబ్‌ ప్రావిన్స్ గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం ఇక‌ హ‌ఫీద్ ప్ర‌తి క‌ద‌లిక‌‌పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది. దానితో పాటు అక్క‌డి పోలీసులు ఎప్పుడు కోరితే అప్పుడు హ‌ఫీద్‌ పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది. పాక్‌ హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కౌంటర్‌ టెర్రర్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ చర్యలు ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో హఫీజ్ స‌హా మరో నలుగురి పేర్లను కూడా చేర్చిన‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News