: అసెంబ్లీ సాక్షిగా ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేశారు: పన్నీర్ వర్గం


అసెంబ్లీ సాక్షిగా శశికళ వర్గం ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేసిందని పన్నీరు సెల్వం వర్గం మండిపడింది. శాసనసభలో పళనిస్వామి బలపరీక్షలో నెగ్గిన అనంతరం తన మద్దతుదారులతో బయటకు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడుతూ, శాసనసభ సాక్షిగా ధర్మాన్ని, న్యాయాన్ని ఖూనీ చేశారని చెప్పారు. జయలలిత అభీష్ఠానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడిందని వారు తెలిపారు. దీనిపై ప్రజాన్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి జరిగిన దారుణాన్ని వివరిస్తామని వారు వెల్లడించారు. ఈ రోజు ఓడింది తాము కాదని, ధర్మం, న్యాయం ఓడిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News