: తమిళనాడు అసెంబ్లీలో జరిగింది దురదృష్టకరం: కపిల్ సిబాల్


తమిళనాడు అసెంబ్లీలో ఈ రోజు జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులంతా ఆమెదించాల్సిందే అని చెప్పారు. స్పీకర్ పై కూడా దాడికి యత్నించడం మంచిది కాదని అన్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను టీవీల్లో చూపించకపోవడంపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని చెప్పారు. మరోవైపు, వాయిదా అనంతరం కూడా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో, మరోసారి సభను వాయిదా వేశారు స్పీకర్.


  • Loading...

More Telugu News