: అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బహిష్కరించిన స్పీకర్.. మరింత పెరిగిన ఉద్రిక్తత


తమిళనాడు శాసనసభలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వాయిదాకి ముందు స‌భ‌లో డీఎంకే స‌భ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన స్పీక‌ర్ ధ‌న్ పాల్.. వారిని స‌భ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో మ‌రింత గంద‌రగోళం నెల‌కొంది. స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్టి డీఎంకే సభ్యులు ఆందోళ‌న తెలుపుతున్నారు. స‌భ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ వారికి సూచిస్తున్నారు. స్పీక‌ర్ మాట‌లు వినిపించుకోని డీఎంకే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. అదుపుత‌ప్పి నినాదాల‌తో హోరెత్తిస్తున్నారు. స‌భ‌లోనే నిర‌స‌న‌కు దిగి ఎన్న‌డూ లేని విధంగా గంద‌ర‌గోళం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News