: ఒకరు కాదు.. స్పీకర్ చైరులో కూర్చున్నది ఇద్దరు ఎమ్మెల్యేలు.. విజువల్స్ విడుదల


తమిళనాడు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి విశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ర‌హ‌స్య ఓటింగ్ వినతిని స్పీకర్ ధన్‌పాల్ తిర‌స్క‌రించ‌డంతో ఉద్రిక్త‌త చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. స‌భ నిర్వ‌హించ‌డానికి ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో స్పీక‌ర్ స‌భ‌ను ఒంటిగంట‌వ‌ర‌కు వాయిదా వేశారు. మ‌రోవైపు అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల‌పై విజువల్స్‌ విడుద‌ల‌య్యాయి.

స్పీక‌ర్ పోడియంలోకి దూసుకువ‌చ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు అక్క‌డ హై డ్రామాకు తెర‌లేపుతూ స్పీక‌ర్‌కు అవ‌మానం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు విజువ‌ల్స్‌లో స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. అనంత‌రం స్పీక‌ర్ అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డంతో స్పీక‌ర్ చైర్‌లో కూర్చోవ‌డానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు క్యూ కట్టిన‌ట్లు నిల‌బ‌డ్డారు. ముందుగా స్పీక‌ర్ చైర్‌లో డీఎంకే ఎమ్మెల్యే కువ్వా కూర్చున్నారు. అనంత‌రం న‌వ్వుతూ వ‌చ్చిన మ‌రో డీఎంకే నేత కూడా స్పీక‌ర్ చైర్‌లో కూర్చున్నారు. ఆయ‌న ప‌క్క‌న మ‌రో డీఎంకే నేత చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  

  • Loading...

More Telugu News