: ఆరు డివిజన్లలో ఓటింగ్... మొదటి డివిజన్ ఓట్లన్నీ పళనిస్వామికే
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష ప్రారంభమయింది. సీక్రెట్ ఓటింగ్ విధానం ద్వారా కాకుండా, హెడ్ కౌంట్ విధానంలో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం ఆరు డివిజన్లుగా ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, తొలి డివిజన్ ఓటింగ్ ముగిసింది. ఈ డివిజన్ లో ఓట్లన్నీ పళనిస్వామికే పడ్డాయని సమాచారం. ఇంకా ఐదు డివిజన్లకు ఓటింగ్ జరగాల్సి ఉంది. అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మల్యేలు హాజరయ్యారు. రహస్య ఓటింగ్ లేకపోవడంతో, పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.