: తలుపులన్నీ వేసేసుకొని కొనసాగుతున్న తమిళనాడు అసెంబ్లీ.. పోలీసులతో మీడియా వాగ్వివాదం
తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష కోసం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. డీఎంకేలో కరుణానిధితో పాటు మరో సభ్యుడు కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు తలుపులన్నీ వేసుకొని కొనసాగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేసి మీడియాను అడ్డుకున్న నేపథ్యంలో విలేకరులు అక్కడి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మీడియా హక్కులను ఉల్లంఘిస్తున్నారని విలేకరులు పోలీసులను నిలదీస్తున్నారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను కాసేపు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.