: వేలానికి హిట్లర్ వాడిన రెడ్ ఫోన్.. శత్రువుల ప్రాణాలు తీయాలని ఈ ఫోన్లోనే ఆదేశించారట!
ప్రపంచాన్ని గడగడలాడించిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ వినియోగించిన పర్సనల్ ట్రావెలింగ్ ఫోన్ వేలానికి వచ్చింది. ఆయన అప్పట్లో వాడిన రెడ్ ఫోన్ ఈ వేలంలో కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్ డాలర్ల ధర పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. చెసాపెకే సిటీలో జరగనున్న అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఉంచనున్న ఈ రెడ్ ఫోన్‌పై హిట్లర్ పేరు కూడా ఉండడంతో దాని కోసం పోటీ బాగానే ఉండవచ్చని భావిస్తున్నారు. అప్పట్లో నియంత హిట్లర్ ఇదే ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేస్తూ వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వాహకులు పేర్కొంటున్నారు.