: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 55 సీట్లేనా?.. అది బోగస్ సర్వే.. ఉత్తమ్ సర్వేపై కోమటిరెడ్డి ఫైర్
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిపై సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 55 సీట్లు మాత్రమే వస్తాయని, 26 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తాను నిర్వహించిన సర్వేలో తేలిందని ఉత్తమ్ కుమార్ చెప్పడాన్ని కోమటిరెడ్డి తీవ్రంగా ఖండించారు. అది బోగస్ సర్వే అని కొట్టి పడేశారు. తప్పుడు సర్వేలతో అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించవద్దంటూ హితవు పలికారు. గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన అధికారం రాదని వ్యంగ్యంగా అన్నారు. 2019 వరకు తానే పీసీసీ అధ్యక్షుడినంటూ ఉత్తమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది తగదని హితవు పలికారు.