: మరో షాక్.. శశికళకు ఈసీ నోటీసులు
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జైలుకు వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై పన్నీర్ సెల్వం వర్గీయుడు మైత్రేయన్ నిన్న ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ఆయన చేసిన ఫిర్యాదుపై ఈ రోజు సాయంత్రం ఈసీ స్పందించి శశికళకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నికపై ఈ నెల 28 లోపు తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం కావాలనుకున్న శశికళ జైలుకి వెళ్లి నిరాశలో మునిగిపోయి ఉన్న సమయంలో ఈసీ నుంచి నోటీసు రావడం ఆమెను మరింత ఆందోళనకు గురిచేసే అంశం.