: చిన్నమ్మను తమిళనాడు జైలుకు తరలించే ఆలోచన?


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో వున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను సాధ్యమైనంత త్వరగా తమిళనాడులోని జైలుకు తరలించేందుకు కర్ణాటక కోర్టును పళనిస్వామి సర్కారు ఆశ్రయించనుందట. శశికళ శిక్షాకాలం తమిళనాడు జైలులో అనుభవించేందుకు వీలుగా ఆమెకు అవకాశం కల్పించాలని పళనిస్వామి సర్కార్ అడగనుందట. ఒకవేళ, తమిళనాడు సర్కార్ చేసే ఈ విజ్ఞప్తిని కనుక కర్ణాటక ప్రభుత్వం అంగీకరిస్తే, ఆ విజ్ఞప్తిని కోర్టు ముందు ఉంచుతారని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కాగా, పళని స్వామి రేపు అసెంబ్లీలో బలనిరూపణ అనంతరం, బెంగళూరు వెళ్లి శశికళ ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శశికళను తమిళనాడు జైలుకు మార్చాలనే అంశం ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News