: ఆందోళనకారులను అరెస్టు చేయవద్దు: తమిళనాడు పోలీసులకు పన్నీర్ సెల్వం లేఖ
అన్నాడీఎంకేలో శశికళ నటరాజన్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మద్దతుదారులు, ఆయన పట్ల సానుభూతి తెలుపుతున్న ప్రజలు పోరుకి సిద్ధమవుతున్న వేళ ఈ రోజు పన్నీర్ సెల్వం ఆ రాష్ట్ర పోలీసులకి ఓ లేఖ రాశారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ జయలలిత మద్దతుదారులు జరపనున్న శాంతియుత నిరసనను అడ్డుకోవద్దని, నిరసనకారులను అరెస్టు చేయకూడదని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా, శశికళ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిపే క్రమంలో పన్నీర్ సెల్వం దూకుడును కనబరుస్తున్నారు. అందుకోసం తమ వర్గ నేతలతో చర్చలు జరుపుతున్నారు.