: వృద్ధులైన క్షురకులు తలనీలాలు తీయద్దు!: మద్రాసు హైకోర్టు
తమ తలపై కూర్చున్న గర్వాన్ని దేవుని పాదాల వద్ద వదలి వెళుతున్నామంటూ భక్తులు ఆలయాల్లో తలనీలాలు సమర్పించుకుంటారు. తలనీలాలు తీసే సమయంలో తలపై ఈమాత్రం చిన్న గాటు పడినా రక్తం వస్తుంది. అందుకే, ఆలయాల్లో క్షవరం చేసే వ్యక్తుల చేతులు ఏ మాత్రం వణకకుండా ఆ పనిచేయాల్సి ఉంటుంది. అయితే, 60 ఏళ్లు దాటిన వృద్ధులు అలా ఆ పని చేయగలరా? క్షవరం చేస్తోన్న సమయంలో వారి చేతులు వణికితే భక్తుడికి గాటు పడడమే కాదు.. ఒక్కోసారి చెవి కూడా తెగిపోయే ప్రమాదం ఉంది.
అందుకే మధురైలోని పళని గుడిలో 60 ఏళ్లు దాటిన క్షురకులకు తలనీలాలు తీసే పని అప్పగించవద్దని తాజాగా మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది. దిండుగల్ జిల్లా పళనిలోని దండాయుధపాణి స్వామి దేవాలయంలో 60 ఏళ్లపైబడిన వారిని కూడా తలనీలాలు తీసే పని చేసుకోవచ్చంటూ ఆ ఆలయ ఈవో ఇచ్చిన ఆదేశాలని సవాలు చేస్తూ పళనికి చెందిన రిటైర్డు క్షురకుడు వేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.