: జైల్లో జయలలితకు కల్పించిన వసతులు.. శశికళకు ఎందుకు కల్పించలేదు?


అక్రమాస్తుల కేసులో గతంలో జయలలితతో పాటు తాను జైల్లో గడిపినప్పుడు తమకు కల్పించిన సౌకర్యాలన్నింటినీ... ఇప్పుడు కూడా కల్పిస్తారని భావించిన శశికళకు నిరాశే మిగిలింది. ఆమెకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి కోర్టు ఒప్పుకోలేదు. అప్పట్లో జయలలిత ముఖ్యమంత్రి కావడం, దానికి తోడు ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల... ఆమెకు ఏ-గ్రేడు సౌకర్యాలు కల్పించారని జైలు వర్గాలు తెలిపాయి. శశికళది ఆమె స్థాయి కాకపోవడంతో, ఆమెకు ఎలాంటి అదనపు సౌకర్యాలను కల్పించలేదని చెప్పాయి. శశికళ కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే, ఆమెను సాధారణ ఖైదీగా గుర్తించారని చెబుతున్నారు. జైల్లో ఆమెకు 10/8 సైజ్ సెల్లును కేటాయించారు. ఇందులోనే తన వదిన ఇళవరసితో కలసి ఆమె ఉంటున్నారు.

  • Loading...

More Telugu News