: నేను చిల్లర దొంగను కాను.. జైలు అధికారులతో శశికళ గొడవ!


బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఓ సాధారణ ఖైదీలా కాలం గడుపుతున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా చూడాలని, ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టుకు విన్నవించుకున్నా... ఆమె కోరికను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, సాధారణ ఖైదీలా జైల్లో గడపాల్సి రావడాన్ని ఆమె అవమానంగా భావిస్తున్నారు.

ఆమెను జైలు వద్దకు తీసుకెళ్లే సమయంలో, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో, ఆమెను జీపులోనే జైల్లోకి తీసుకెళ్లాలని భావించారు. కానీ, అందుకు శశికళ నిరాకరించడంతో, ఆమెను నడిపించుకుంటూనే జైల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జైలు సిబ్బందితో శశికళ కాస్త గొడవ పడ్డారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎంత దూరమైనా తాను నడుస్తూనే వస్తానని... చిల్లర దొంగలాగ తనను జీపులో తీసుకెళ్తామంటే కుదరదని ఆమె గొడవపడ్డారట. జైల్లోకి వెళ్లిన తర్వాత శశికళకు తెల్ల చీర ఇచ్చినా, ఆమె దాన్ని కట్టుకోలేదని సమాచారం. కాసేపు నిద్రపోయి, ఆ తర్వాత పులిహోర తిని, కాఫీ తాగారట.  

  • Loading...

More Telugu News