: పన్నీర్ సెల్వంకు మద్దతుగా మరో ఎమ్మెల్యే!


పన్నీర్ సెల్వంకు మద్దతుగా మరో ఎమ్మెల్యే నిలిచారు. పన్నీర్ సెల్వంకు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయనను నటరాజన్ కలిశారు. కాగా, ప్రస్తుతం, పన్నీర్ వర్గంలో పదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా, నటరాజన్ చేరికతో ఆ సంఖ్య పదకొండుకు చేరింది. ఇదిలా ఉండగా, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి రేపు అసెంబ్లీలో బలనిరూపణకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో పన్నీర్ వర్గం ఉంది. 

  • Loading...

More Telugu News