: నేను పన్ను ఎగ్గొట్టలేదు... ఆ 'కోటి' తెలంగాణ ఇచ్చింది: సానియా మీర్జా


సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టానంటూ వచ్చిన అరోపణలు అవాస్తవాలని ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా తెలిపింది. వివరణ ఇచ్చేందుకు తమ ముందు సానియా లేదా ఆమె అకౌంటెంట్ హాజరు కావాలంటూ, సర్వీస్ ట్యాక్స్ అధికారుల పిలుపుపై హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తాను సేవాపన్నులు ఎగ్గొట్టలేదన్నారు. రిటర్న్స్ లో చూపించిన కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ట్రైనింగ్ ప్రోత్సాహకం కింద ఇచ్చిందని తెలిపింది. ఆ డబ్బును తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు వచ్చిన నజరానా కాదని ఆమె స్పష్టం చేసింది. సానియా ప్రకటనను తెలంగాణ క్రీడాశాఖాధికారులు ధ్రువీకరించారు. 

  • Loading...

More Telugu News