: చివరి ప్రయత్నాలను మొదలుపెట్టిన పన్నీర్ సెల్వం


తమిళనాడు ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి... అసెంబ్లీలో రేపు బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, పన్నీర్ సెల్వం తన చిట్టచివరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే క్రమంలో, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు, వారిని ఇప్పటికీ రిసార్టులోనే ఉంచారు పళనిస్వామి.

ఈ నేపథ్యంలో, రిసార్టులోని ఎమ్మెల్యేలను కలిసేందుకు పన్నీర్ వర్గం ప్రయత్నిస్తోంది. మెజారిటీ తమిళ ప్రజలు శశికళను వ్యతిరేకిస్తున్నారని... అందువల్ల ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాలని... తమకు మద్దతు తెలపాలని ఎమ్మెల్యేలను కలసి కోరనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News