: వ్యాపారిని చంపి... ఆ శవం వద్ద డ్యాన్స్ చేశారు!


పట్టపగలు ఓ ఫైనాన్స్ వ్యాపారిని కాల్చి చంపిన దుండగులు... అతని శవం వద్ద ఆనందంగా డ్యాన్స్ చేశారు. అంతేకాదు ఆ తతంగాన్ని వీడియో తీశారు. ఈ ఘటన పంజాబ్ లోని సంగ్రూర్ సమీపంలో ఉన్న లోంగోవాల్ పట్టణంలో జరిగింది. దల్వీందర్ సింగ్ కు చెందిన ఐదుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే, హర్ దేవ్ సింగ్ అనే ఫైనాన్స్ వ్యాపారికి దల్వీందర్ సింగ్ రూ. 5 లక్షలు అప్పు ఇచ్చాడు. ఈ విషయంలోనే వారిద్దరికి గొడవ జరిగింది. ఈ క్రమంలో దల్వీందర్ అనుచరులు హర్ దేవ్ తలలోకి తుపాకీతో ఐదు రౌండ్లు కాల్చారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం, అతడి శవం వద్ద డ్యాన్స్ చేసిన దుండగులు, దాన్ని వీడియో కూడా తీశారు. అంతేకాదు, దమ్ముంటే తమను పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ కూడా విసిరారు. ఈ ఘటనతో భయభ్రాంతులైన వ్యాపారులు... తమ షాపుల షట్టర్లు మూసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీళ్లంటే పోలీసులకు కూడా భయమేనని... అలాంటి పోలీసులు తమకు రక్షణ ఎక్కడ కల్పిస్తారని వాపోయారు.

మరోవైపు, తన కుమారుడిని చంపిన దుండగులను అరెస్ట్ చేసేంత వరకు పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదని అతని తండ్రి పట్టుబట్టారు. హంతకులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఎస్పీ ఇందర్ బీర్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News