: మోదీ, అఖిలేశ్ యాదవ్ లు తమ రాష్ట్రాల్లో అల్లర్లను అదుపుచేయలేకపోయారు: అసదుద్దీన్‌ ఒవైసీ


ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కొలోనిలాంజ్‌ ప్రాంతంలో ప్ర‌సంగం చేసిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. ప్ర‌ధాన‌మంత్రి  నరేంద్ర మోదీ, యూపీ సీఎం అఖిలేశ్  యాదవ్ లపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వారిరువురూ సీఎంలుగా ఉన్నప్పుడు తమ రాష్ట్రాలలో చోటు చేసుకున్న అల్లర్లను అదుపుచేయలేకపోయారని ఆయ‌న విమ‌ర్శించారు. వారిరువురు ఒకే నాణానికి ఉండే బొమ్మ బొరుసు లాంటి వార‌ని ఆయ‌న అన్నారు. ముజఫర్‌ నగర్‌లో గ‌తంలో జ‌రిగిన‌ అల్లర్ల బాధితులకు అఖిలేశ్ సర్కారు స‌రైన న్యాయం చేయ‌లేద‌ని ఆరోపించారు. మ‌రోవైపు గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు కూడా మోదీ అలాగే వ్య‌వ‌హ‌రించారని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలోని ముస్లింల ఓట్ల‌ను తమ పార్టీ కొల్లగొడుతుందని యూపీ అధికార‌ సమాజ్‌వాదీ పార్టీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

  • Loading...

More Telugu News