: ఇచ్చిన మాట నిలబెట్టుకుని.. ఇరవై ఏళ్ల కుర్రాడితో డేటింగ్ చేసిన టెన్నిస్ భామ!
జీవితంలో అతిపెద్ద పొరపాటును విజయవంతంగా పూర్తి చేశానని, త్వరలో 23వ పడిలోకి అడుగిడనున్న కెనడా టెన్నిస్ స్టార్ ఎగునీ బౌచర్డ్ తెలిపింది. గత నెలలో అమెరికాలో జరిగిన సూపర్ బౌల్ టోర్నీ సందర్భంగా అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా అట్లాంటా తొలి అర్ధ భాగంలో 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్నప్పుడు విజయం అట్లాంటాదేనని ట్వీట్ చేసింది. దీనిని అంగీకరించని 20 ఏళ్ల విద్యార్థి జాన్ గొహ్రెక్ అది తల్లకిందులై, న్యూ ఇంగ్లండ్ గెలిస్తే నాతో డేటింగ్ కి వస్తావా? అంటూ సవాల్ విసిరాడు. దానికి ఆమె సరే అంది.
బెట్ కట్టిన జాన్ కూడా ఊహించని విధంగా న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ జట్టు అనూహ్యంగా పుంజుకుని, ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 34-28 తేడాతో అట్లాంటా ఫాల్కోన్స్ జట్టును ఓడించింది. దీంతో అంతా షాకయ్యారు. అందరికంటే ఎక్కువ ఎగునీ బౌచర్డ్ షాక్ కు గురైంది. జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అభిమానితో డేటింగ్ పందెం కాయడమని పేర్కొంది. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని తెలిపింది. చెప్పినట్టే అభిమాని జాన్ గొహ్రెక్ తో డేటింగ్ కు వెళ్లింది. తొలుత మిల్ వాకీ-ఎన్బీఏ మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ చూశామని, తరువాత డేటింగ్ కోసం స్విమ్ సూట్ ఎంచుకున్నానని తెలిపింది. ఈ మేరకు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసింది.