: తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం
తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామితో రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు కేబినెట్ లో చోటు సంపాదించుకున్న మరో 30 మంది నేతలతో కూడా విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పళనిస్వామి వర్గ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. మరోవైపు పలువురు మంత్రుల బంధువులు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి అక్కడకు వచ్చారు. ఎట్టకేలకు తమకే అధికారం దక్కడంతో శశికళ వర్గీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.