: సర్వం సిద్ధం.. ప్రమాణ స్వీకారం కోసం పళనిస్వామితో పాటు రాజ్ భవన్ చేరుకున్న 31మంది నేతలు
కాసేపట్లో తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించనున్న విషయం తెలిసిందే. అందుకోసం సర్వం సిద్ధమైంది. రాజ్‌భవన్ వద్ద కోలాహలం మొదలైంది. పళనిస్వామి పోయెస్ గార్డెన్ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్టు నుంచి శశికళ వర్గం ఎమ్మెల్యేలు కూడా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. కేబినెట్ లో చోటు సంపాదించుకున్న 31 మంది నేతలు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్ బయట శశికళ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రేపు పళనిస్వామి బెంగళూరుకు వెళ్లి అక్కడి జైలులో ఉన్న శశికళను కలవనున్నట్లు సమాచారం.